ముద్రా బ్యాంక్ ప్రారంభించిన మోడీ

 

భారత ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ముద్రా బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ‘‘20 వేల కోట్ల మూలధనంతో ముద్రా బ్యాంకు ప్రారంభమవుతోంది. ముద్రా బ్యాంకు ద్వారా 5.77 కోట్ల యూనిట్లకు లాభం కలుగుతుంది. ప్రస్తుతం దేశంలో స్వయం ఉపాధి అవసరాలు పెరుగుతున్నాయి. ముద్రా బ్యాంకు చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక సాయం చేయనుంది. దేశంలోని చిన్న పరిశ్రమలను ఆదుకోవాల్సిన అవసరం పెరిగింది’’ అన్నారు.