‘మా’ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నేడే
posted on Apr 17, 2015 8:22AM
.jpg)
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. నటుడు ఓ.కళ్యాణ్ సిటీ సివిల్ కోర్టులో వేసిన పిటిషనును కొట్టివేసి ఫలితాలు వెల్లడించేందుకు ‘మా’కు కోర్టు అనుమతి ఈయడంతో ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్, ఫిల్మ్ ఛాంబర్ లో ఎన్నికల అధికారులు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించబోతున్నారు. అయితే కళ్యాణ్ తను క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేయబోతున్నట్లు ప్రకటించడంతో మళ్ళీ కొంచెం గందరగోళం నెలకొంది. కానీ ఆయన హైకోర్టులో పిటిషను వేసి దానిని కోర్టు అంగీకరించేలోగానే ఓట్లు లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడుతాయి కనుక హైకోర్టు అతని పిటిషనును విచారణకు స్వీకరిస్తుందా లేదా స్వీకరించినా ‘మా’ ఎన్నికలపై మళ్ళీ స్టే విదిస్తుందా లేక హైకోర్టు కూడా అతని పిటిషనును కొట్టివేస్తుందా? అనేసందేహాలున్నాయి. ‘మా’ లో మొత్తం 702మంది సభ్యులు ఉండగా కేవలం 394 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఏది ఏమయినప్పటికీ ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడిన రాజేంద్ర ప్రసాద్, జయసుధ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే విషయం ఈరోజు 10-11 గంటలలోగా తేలిపోబోతోంది.