బాలయ్యతో పేకాట ఆడిన రోజా...

 

నంద్యాల ఉపఎన్నిక తరువాత కాస్త దూకుడును తగ్గించిన వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా.. మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను... మీరు పేకాట బాగా ఆడతారట కదా? అని అడుగగా... దానికి ఆమె... తాను పేకాట ఆడుతున్నట్టు తెలిస్తే, తన తల్లి కొట్టేదని.. తొలి చిత్రం షూటింగ్ సమయంలో తనకెంతో టెన్షన్ గా ఉండేదని గుర్తు చేసుకున్న రోజా, ఎప్పుడు షూటింగ్ అయిపోతే ఇంటికెళ్లి పోదామా అని ఉండేదని అన్నారు. అయితే, బాలకృష్ణతో 'భైరవద్వీపం' చిత్రం చేసిన సమయంలో పేకాట ఆడానని చెప్పారు. ఆయనతో షూటింగ్ ఉంటే మాత్రం, సెట్లో పేకాట సందడి కనిపించేదని అన్నారు. భైరవద్వీపం సినిమా షూటింగ్ గ్యాప్ లో తనను, సత్యనారాయణను పిలిచి పేకాటకు కూర్చేబెట్టేవారని, అప్పుడు మాత్రం తాను కూడా ఆడేదాన్నని చెప్పారు. డబ్బులకు మాత్రం కాదని నవ్వుతూ వెల్లడించారు. కాగా ఇదే ఇంటర్వ్యూలో తన గుండుపై...ఇలాంటి ఫోటోలు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుందని ప్రశ్నించగా...ఇక ఫొటో చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన రోజా....వాడెవడో కనిపిస్తే చెప్పుతో కొట్టాలని ఉందని అన్నారు. ఈ ఫోటోలు కేవలం తనకు మాత్రమే పెట్టలేదని, ఇలాంటి ఫోటోలు చాలా మంది వైఎస్సార్సీపీ నేతల ఫోటోలకు పెట్టాడని మండిపడ్డారు. ఏం మేము తలచుకుంటే టీడీపీ నేతల పెళ్లాలకు గుండ్లు కొట్టేలా మార్ఫింగ్ ఫోటోలు పెట్టలేమా? అని ఆమె ప్రశ్నించారు. వాడెవడో ఒక అబ్బాఅమ్మకి పుట్టి ఉంటే ఇలాంటి పని చేస్తాడా?...వాడిని ఏం చెయ్యాలి? అని ఆమె ప్రశ్నించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu