రోజా చేతిలో అందుకే ఓడిపోయా....
posted on Oct 13, 2017 3:47PM

2014 ఎన్నికల్లో టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఓడి పోయిన సంగతి తెలిసిందే. వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన రోజా చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. అయితే తాను అప్పుడు రోజా చేతిలో ఓడిపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెబుతున్నాడు గాలి. వైసీపీ ఎమ్మెల్యే రోజా చేతిలో తన ఓటమికి కారణం నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలేనని అన్నారు. తన సేవలను నేతలు గుర్తించలేదని చెప్పారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని... ఎన్టీఆర్ మినహా ఇతర సీఎంలందరిపైన అసెంబ్లీలో తొడగొట్టానని అన్నారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే మంత్రిని అయ్యేవాడిని.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన గురించి పూర్తిగా తెలుసు కాబట్టే... ఓడిపోయినా గుర్తింపునిచ్చారని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో 16 అంశాల్లో కుప్పం తర్వాతి స్థానంలో నగరి ఉందని... నేతలు, కార్యకర్తలు ఈ విషయాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని, పార్టీ ప్రతిష్టను పెంచాలని తెలిపారు.