ఆధారాలు ఉన్నాయా? అయితే.. కోర్టుకు వెళ్లండి..
posted on Oct 13, 2017 4:25PM

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన కొడుకు కంపెనీ పై వస్తున్న అవినీతి ఆరోపణలపై స్పందించాడు. భాజపా అధికారంలోకి వచ్చాక ఆయనకు చెందిన సంస్థ ఆదాయం 16వేల రెట్లు పెరిగిందని ద వైర్ అనే వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. దీంతో అమిత్ షా తనయుడు జేషా పరువునష్టం దావా వేశారు. ఇక దీనిపై స్పందించిన అమిత్ షా కూడా... అవినీతికి పాల్పడినట్లు తగిన ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లమని సూచించారు. అంతేకాదు ‘కాంగ్రెస్ ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. మరి కాంగ్రెస్ ఎందుకు క్రిమినల్ లేదా పరువు నష్టం కింద రూ.100కోట్ల దావా వేయలేదు? ఎందుకంటే ఆ కేసులను ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. జే పరువు నష్టం దావా వేశారు. విచారణ చేయాల్సిందిగా కోరారు. జేషా అవినీతి ఆరోపణలపై మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అయితే.. కోర్టుకు వెళ్లండి’ అని అమిత్ షా అన్నారు.