నగ్నంగా ఉండటమే ఆమెకి ఇష్టమట...
posted on Jan 9, 2015 5:00PM

ఆస్ట్రేలియా సూపర్ మోడల్ మిరండా కెర్ మూడు పదుల వయసు దాటినా, పెళ్ళి చేసుకుని ఆరేళ్ళ కొడుకుకు తల్లి అయినా మోడల్‌గా తన హవా భారీ స్థాయిలో నడిపిస్తోంది. మొన్నీమధ్యే హార్పర్స్ బజార్స్ పత్రికకు మిరండా కెర్ ఇచ్చిన టాప్‌లెస్ పోజులు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశాయి. కవర్ పేజీయే అంత ఊపుడు ఊపితే, ఆ కవర్ పేజీ వున్న పత్రిక మార్కెట్లోకి వచ్చిన తర్వాత, తన టాప్‌లెస్ ఫొటో మీద స్పందిస్తూ మిరండా మాట్లాడిన మాటలు మరింత ఊపి పారేశాయి. ‘‘టాప్‌లెస్‌గా నేను చాలా బాగున్నానని అందరూ అభినందిస్తున్నారు. ఈ అభినందనలు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. వాస్తవానికి నాకు టాప్ లెస్‌గా మాత్రమే కాకుండా పూర్తి నగ్నంగా వుండటం అంటే ఎంతో ఇష్టం. నా నగ్నత్వాన్ని అందరికంటే ఎక్కువగా నేనే ఆరాధిస్తుంటాను’’ అంది. మిరండా కెర్ మాట్లాడిన మాటలను చూస్తుంటే, ఈ అందగత్తె త్వరలో ఏ ప్రముఖ ఫ్యాషన్ పత్రిక కవర్ పేజీమీదో నగ్నంగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆస్ట్రేలియా ఫ్యాషన్ ప్రపంచం గుసగుసలాడుకుంటోంది.