లోకేష్ కు ఆ రెండిటికి మధ్య తేడా తెలీదు.. మంత్రి కొడాలి నాని సెటైర్లు

ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి అటు టీడీపీ, ఇటు లోకేష్ పై సెటైర్లు వేశారు. నారా లోకేష్ కు అసలు వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. లోకేష్ ఒక వేస్ట్ ఫెలో అని నాని తీవ్ర స్థాయిలో విమర్శ చేసారు. రాష్ట్రంలో లోకేష్ ఎంత తిరిగినా టీడీపీకి ఏమాత్రం ఉపయోగం లేదని అయన వ్యాఖ్యానించారు. అమరావతిలో ఉన్న రైతులు మాత్రమే రైతులు కాదని కొడాలి నాని అన్నారు. అమరావతిలో భూములు కొన్నారు కాబట్టే టీడీపీ నేతల హడావిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు బేడీలు వేశారని తాను కూడా బేడీలు వేసుకున్న దేవినేని ఉమ.. మరి బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు తనను తాను గన్‌తో కాల్చుకోవాలని కొడాలి నాని అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వస్తున్న ఇబ్బందులకు అప్పటి మంత్రి దేవినేని ఉమానే కారణమని నాని ఆరోపించారు.

 

అంతకుముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రేట్లు పెరిగాయని, రూ. 55వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని వ్యాఖ్యానించారు. ఇదే అంశం పై ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో రాజ్యసభలో కేంద్రాన్నీ రూ. 55వేల కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారా ? అని అడడగ్గా.. ఒప్పుకున్నట్లు చెప్పిందని అన్నారు. ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు తెస్తామని చెప్పిన వైసీపీ.. 22 మంది ఎంపీలను ఇస్తే.. ఇప్పుడు వాళ్ల పైన ఉన్న కేసుల మాఫీ కోసం ఆ నిధులను రూ. 25 వేల కోట్లకు కుదించారని లోకేష్ మండిపడ్డారు.