మంత్రి ఫరూక్ కు సతీ వియోగం

ఆంధ్రప్రదేశ్  మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్   సతీమణి షెహనాజ్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమెశుక్రవారం (మార్చి 21)  ఉదయం తుదిశ్వాస విడిచారు. సతీమణి మరణవార్త తెలియడంతో మంత్రి ఫరూక్ హుటాహుటిన నంద్యాల నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. షెహనాజ్‌ భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి నంద్యాలకు తరలించనున్నారు.  శనివారం (మార్చి 22) అంత్యక్రియలు నిర్వహిస్తారు.  

గత ఐదారు నెలలుగా షెహనాజ్  అనారోగ్యతో బాధపడుతున్నారు.మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సతీమణి షెహనాజ్  మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తిం చేశారు.  ఫరూక్   ఫరూక్‌ కుటుంబానికి అల్లా మనోధైర్యాన్ని అందించాలని ప్రార్థించారు. అలాగే మంత్రి లోకేష్, మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు ప్రగాఢ సంతాపం తెలిపారు.