విశాఖ మన్యంలో మావోల కదలికలు!

ఉమ్మడి విశాఖ జిల్లా మన్యంలో మావోల కదలికలు పెరిగాయి. దీంతో మన్యం ప్రాంతంలో అలజడి పెరిగింది, యుద్ధ వాతావరణం నెలకొంది. కొయ్యూరు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టు సీనియర్ నాయకులు తృటిలో తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.  

ఆపరేషన్ కగార్ పేరిట గత కొన్ని నెలలుగా భద్రత దళాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి విదితమే. చత్తీస్గడ్, ఒడిశా, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వందల సంఖ్యలో మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. మరీ ముఖ్యంగా మావోయిస్టులకు అత్యంత కీలకమైన ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టలు హతమయ్యారు.  ఈ  నేపథ్యంలో మావోయిస్టులు ఆంధ్ర ఒడిశా బార్డర్ వైపు వచ్చారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే   గూడెం కొత్త వీధి క, య్యూరు మండలాల్లో గత రెండు వారాలుగా మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయంటున్నారు. దీనిపై కచ్చితమైన సమాచారం అందడంతో  ఇటు ఆంధ్ర అటు ఒరిస్సా పోలీస్ బలగాలతో పాటు కేంద్ర బలగాలు కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఏవోబీ అడవులను మావోయిస్టుల కోసం  జల్లెడ పడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే  సోమవారం( మే 5)  ఒక్కరోజే  రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. కొయ్యూరు మండలం మందపల్లి పుట్టకోట కంటారాం పరిసరాల్లో ఈ ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టుల వైపు నుంచి కానీ భద్రతా బలగాల వైపు నుంచి కానీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.  ఈ ప్రాంతం పై మావోయిస్టు నాయకులకు పూర్తిస్థాయిలో పట్టు ఉండటం, గిరిజన గ్రామాల వారి పట్ల సానుభూతి ఉండటంతో  వారి జాడ తెలుసుకోవడం భద్రతా దళాలకు ఒకింత కష్టంగా మారిందంటున్నారు.  కాగా సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ల నుంచి సీనియర్ మావోయిస్టు నేతలు తప్పించుకున్నట్లు పోలీసులు  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu