మంచు కుటుంబంలో మళ్లీ మంటలు?

మంచు కుటుంబంలో విభేదాలు ఇప్పట్లో చల్లారేలా లేవా అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తున్నది. ఇటీవల మంచుకుటుంబంలో విభేదాలు రచ్చకెక్కి పోలీసు కేసుల వరకూ వెళ్లిన సంగతి తెలిసిదే. కుటుంబం  మోహన్ బాబు, విష్ణు ఒక వైపు, మనోజ్ మరో వైపు అన్నట్లుగా నిట్టనిలువుగా చీలిపోయిన పరిస్థితి ఏర్పడింది.  ఈ విభేదాలపై మీడియా కవరేజ్ సందర్భంగా మోహన్ బాబు ఒక విలేకరిపై దాడికి పాల్పడిన ఘటనపై ఆయనపై పోలీసు కేసు నమోదైంది. దీంతో ఆయన కొన్ని రోజులు అజ్ణాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించి తాత్కాలిక ఊరట పొందారు.

సుప్రీంలో అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట వచ్చిన తరువాతే ఆయన బయటకు వచ్చారు. గత కొద్ది రోజులుగా ఆయన తిరుపతిలో  సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలలో ఆయన పెద్ద కుమారుడు   విష్ణు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంజు మనోజ్ మాత్రం ఇప్పటి వరకూ ఈ సంబరాలకు దూరంగా ఉన్నారు. భోగి, సంక్రాంతి వేడుకల్లో ఎక్కడా కనిపించని మనోజ్ కనుమ రోజున జరిగే సంబరాల్లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. రంగంపేటలో బుధవారం (జనవరి 15)న జరిగే జల్లి కట్టు వేడుకల్లో పాల్గొనేందుకు నమోజ్ రానున్నారు. అనంతరం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెల్లారని సమాచారం.  ఇప్పటికే యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు, విష్ణు ఉండటంతో.. మనోజ్ రాకతో అక్కడ మళ్లీ  గొడవలు జరుగుతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మనోజ్ రాక సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ అవకాశం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.