సుప్రీం లో కేటీఆర్ కు చుక్కెదురు.. క్వాష్ పిటిషన్ ఉపసంహరణ
posted on Jan 15, 2025 11:48AM
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు సుప్రీంలోనూ చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ బుధవారం (జనవరి 15) విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులలో జోక్యం చేసుకోబోని సుప్రీం కోర్టు విస్పష్టంగా పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన ను డిస్మిస్ చేసే పరిస్థితి ఉండటంతో కేటీఆర్ తరఫు న్యాయవాది పిటిషన్ విత్ డ్రా చేసుకుంటామని పేర్కొన్నారు. దీంతో సుప్రీం కోర్టు అందుకు అంగీకరించింది. పేర్కొంది.
ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కూడా కేటీఆర్ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో తమ వాదన కూడా వినాలని కోరుతూ సుప్రీంలో కేవియెట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ సుప్రీం కోర్టులో తన క్వాష్ పిటిషన్ విత్ డ్రా చేసుకోవడంతో మళ్లీ ఆయన అరెస్టుపై చర్చ మొదలైంది.