జగన్ రెడ్డి సర్కార్ కు బిగ్ షాక్.. మానస ట్రస్టీ చైర్మన్ గా అశోక్ గజపతి రాజే..

జగన్ రెడ్డి ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. మానస ట్రస్టీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సంచయిత నియామక జీవోను కొట్టేసింది. అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై కీలక ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.72ను కొట్టివేసింది. సింహాచల వారహలక్ష్మీ నరసింహ దేవస్థానానికి, మానస ట్రస్ట్ కు అశోక్ గజపతి రాజు  చైర్మన్ గా ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. గతంలో మానస ట్రస్టీ, వారహలక్ష్మీ నరసింహ దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఆయన స్థానంలో సంచయితను నియమిస్తూ 72 జీవోను విడుదల చేసింది.  సంచ‌యిత నియామక జీవోను సవాల్ చేస్తూ అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఉన్నత న్యాయస్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు తీర్పు వెలువ‌రించింది.హైకోర్టు ఆదేశాలతో మానస ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు. 

2020 మార్చిలో మాన్సాస్‌, సింహాచ‌ల ట్ర‌స్టులకు ఛైర్ ప‌ర్స‌న్‌గా సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును రాష్ట్ర ప్ర‌భుత్వం నియమించింది. అప్ప‌టి వ‌ర‌కు ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తిరాజును తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. వంశ‌పార‌ప‌ర్యంగా వ‌స్తున్న ట్ర‌స్టు కావడం వ‌ల్ల వ‌య‌స్సులో పెద్ద‌వారు ట్ర‌స్టీగా ఉండాల‌ని.. సంచ‌యిత నియామకంపై అశోక్ గ‌జ‌ప‌తిరాజు అప్ప‌ట్లో హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఈ ట్ర‌స్టుల ఛైర్మ‌న్‌ను నియ‌మించింద‌ని ఆయ‌న న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే నియామ‌కం చేశామ‌ని ప్ర‌భుత్వం వాద‌న‌లు వినిపించి. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విని తీర్పును రిజ‌ర్వ్ చేసిన ధర్మాస‌నం.. అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా తిరిగి నియ‌మించాల‌ని ఆదేశించింది.