హార్ట్‌ బీట్‌ ఎక్కువై గుండెపోటుతో మృతి చెందిన మమత


పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో.. ఓ యువతి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలో  చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలీస్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో భాగంగా రన్నింగ్ రేసులో పాల్గొన్న మమత అనే యువతి హార్ట్‌ బీట్‌ ఎక్కువై కిందపడిపోయి, మృతిచెందింది. మమత స్వస్థలం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల. తండ్రి సంపత్ ఆటో డ్రైవర్ కాగా, ముగ్గురు కూతుళ్లలో మమత పెద్దమ్మాయి. మమత మృతితో వెలిచాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. కరీంనగర్ జిల్లాలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో కానిస్టేబుల్ సెలక్షన్స్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన పరుగు పందెంలో కూడా మమత పాల్గొంది. అయితే పరుగుపందెం ముగిశాక కాసేపటికే గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. అలాగే స్పృహ తప్పిపడిపోయిన మరో ఇద్దరు అభ్యర్థులను ఆస్పత్రికి తరలించారు. ఇరువురిని జగిత్యాలకు చెందిన రశ్మిత, చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన మనీషాగా గుర్తించారు.