నిజం బయటకు రాకుండా ఉండాలనే.. మమతా బీజేపీ ఫైర్..
posted on Jan 11, 2016 4:15PM

బీజేపీ నేతలు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలపై గత ఆదివారం బెంగాల్‌లోని ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే దీని గురించి వివరాలు తెలుసుకోవడానికి బీజేపీ నిర్ధారణ కమిటీ మాల్దా వెళ్లింది. అయితే వారిని పోలీసులు అక్కడే అడ్డగించి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో వారిని తిరిగి కోల్‌కతా పంపించేశారు. దీంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు బయటకు రాకుండా ఉండాలని మమతా బెనర్జీ ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. కాగా ఈ ఘటనపై కేంద్రం ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని కోరగా.. అవి మత ఘర్షణలు కావని బీఎస్‌ఎఫ్‌కు స్థానిక ప్రజలకు మధ్య జరిగిన చిన్న గొడవ మాత్రమేనని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.