మ‌హా సంక్షోభంతో ఉద్ధ‌వ్‌కే మేలు

శివ‌సేన సింహం గుహ‌, అందులోకి ఎవ‌ర‌యినా వెళ్ల‌డ‌మేగాని తిరిగి రావ‌డం వుండ‌దన్నారు మ‌నోహ‌ర్ జోషి. శివ‌సేన ను ఎందుకు వీడ‌లేక‌పోతున్నార‌ని అడిగితే మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఎదిగి ఆ త‌ర్వాత లోక్‌స‌భ స్పీక‌ర్‌గా చేసిన మ‌నోహ‌ర్ జోషి ఇచ్చిన స‌మాధానం అది. కానీ ఇపుడు  ఆ భ్ర‌మ ప‌టాపంచ ల‌యింది. శివ‌సేన పార్టీ నుంచి వూహించ‌నివిధంగా చాలామంది వీడిపోవ‌డంతో ఆ పార్టీ వీరాభిమానులు సైతం ఆశ్చ‌ర్యంలోంచి ఇంకా తేరుకోలేక‌పోతున్నారు. గ‌తంలో చ‌గ‌న్ భుజ‌బ‌ల్‌, నారాయ‌ణ్ రాణె, రాజ్ థాక్రే వంటి హేమాహేమీలు చేయ‌లేనిదాన్ని ఇపుడు ఏక్‌నాథ్ షిండే చేసి చూపారు. అప్ప‌ట్లో వాళ్లు సేన‌ను వీడితే చిన్న‌పాటి అల‌జ‌డి అయిందేగాని అది సునామీగా మార‌లేదు. శివ‌సేన పుంజుకుంది. కానీ ఇవాళ శివ‌సేన పార్టీ అస్థిత్వ‌మే ప్ర‌శ్నార్ధ‌క‌మైంది. ఇప్పుడు రెండింట మూడు వంతుల ఎమ్మెల్యేలు ఉద్ధ‌వ్‌కి వ్య‌తిరేకంగా  త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌తార‌న్న‌ది షిండే రుజువు చేసుకోవాలి.
అస‌లు శివ‌సేన పార్టీ సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన పార్టీ కాదు, బాలాసాహెబ్ థాక్రే ను ఆరాధ్యునిగా చేసుకుని ఆయ‌నవ‌ల్ల‌నే ప‌టిష్టంగా ఏర్ప‌డిన పార్టీ. ఆయ‌న మాటే శాసనంగా ముంబైలో ఆధిప‌త్యం సాధించింది. అందుకు మ‌రో ప్ర‌ధాన‌కార‌ణం శివ సైనికులు గుడ్డిగా ఆయ‌న ఆదేశాల‌ను పాటించ‌డ‌మే. ప్ర‌భుత్వం ఎలాంటి ప‌ద‌విని ఎప్పుడూ చేప‌ట్టనప్ప‌టికీ, ఆయ‌నే చ‌ట్టంగా వ్య‌వ‌హ‌రించేవారు. ఒక్క మాట‌లో చెప్పా లంటే ఆయ‌న మ‌హారాష్ట్రీయుల‌కు స‌ర్కార్‌!

ప్ర‌ముఖ కార్టూనిస్ట్  ఆర్‌.కె. ల‌క్ష్మ‌ణ్ తో  క‌లిసి ప‌నిచేసిన‌వాడు బాలాసాహెబ్ థాక్రే. మంచి ర‌చ‌యిత, కార్టూ నిస్టు. ఆయ‌న తండ్రి  గొప్ప సంఘ‌సంస్క‌ర్త కేశ‌వ్ సీతారామ్ ప్ర‌బోధ‌క‌ర్‌. ఆయ‌నే  ఒక సంద‌ర్భంలో బాల్ థాక్రే గురించి ఇలా అన్నారు.. ఇక నుంచి నా కుమారుడి జీవితం రాష్ట్రంలో యావ‌త్ మ‌హారాష్ట్రీయుల అభ్యున్న‌తికి అంకితం అని ప్ర‌క‌టించార‌ట‌. మ‌హారాష్ట్రీయుల కోసం మ‌హారాష్ట్ర‌ను కాపాడ‌మ‌ని  సీనియ‌ర్ థాక్రే పిలుపునిచ్చారు. అది ఆయ‌న కుమారుడు ముందుకు తీసికెళ్ల‌గ‌ల‌డ‌ని ఆయ‌న న‌మ్మ‌కం. 1966లో శివ‌సేన ఆవిర్భావానికి ముందు, మ‌హారాష్ట్రీయుల కోసం మ‌హారాష్ట్ర అనేది ఒక భావ‌న‌, దాన్ని ప‌టిష్ట‌ప‌ర చాలి. బాలాసాహెబ్ ఆ త‌ర్వాత పార్టీ ఏర్పాటు చేసి ఆ భావ‌నను ప‌టిష్ట‌ప‌రిచారు. అప్ప‌ట్లో  శివ‌సేన‌కు కాంగ్రెస్ డ‌బ్బు మూట‌ల‌తో మ‌ద్ద‌తునిచ్చింది. 1970ల్లో ఇందిరాగాంధీ ఎమ‌ర్జ‌న్సీ ప్ర‌క‌టించిన‌పుడు థాక్రే దాన్ని స‌మ‌ర్ధించ‌డం పెద్ద వింతేమీ కాదు. అప్ప‌టికి ఆ పార్టీ హిందూత్వ పార్టీ కాదు. అప్ప‌ట్లో ఇత‌ర రాష్ట్రా ల నుంచి ముంబైకి త‌ర‌లివ‌చ్చేవారి సంఖ్య పెర‌గ‌డంతో మ‌రాఠీ మనుష్  అన్న నినాదాన్ని బ‌ల‌ప‌ర చడం థాక్రే వంత‌యింది.  ఇప్ప‌టికీ ఢిల్లీ, ముంబై మ‌ద్య సంక్ష‌భం లో మ‌రాఠీ గుర్తింపును కాపాడుకోవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 

ఓట్ల రాజ‌కీయాల్లో శివ‌సేన ఆధిప‌త్యం వున్నంత‌కాలం బిజెపితో స‌త్సంబంధాలే క‌లిగి వుంది.  థాక్రే నివాసం మాతోశ్రీ ని నిర్ల‌క్ష్యం చేసి మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోవ‌డ‌మ‌న్న‌ది ఏ  బిజెపి నాయ‌కుని వ‌ల్లా కాలేదు.  కానీ బిజెపి రాజ‌కీయాల్లోకి న‌రేంద్ర మోడీ కీల‌క స్థానంలోకి రావ‌డంతో ఈ మొత్తం సీన్ తారు మార‌యింది. 2014లో బిజెపి, శివ‌సేన విడి విడిగా పోటీచేశాయి. మ‌హారాష్ట్ర‌లో బిజెపి ప్ర‌భుత్వానికి  శివ‌సేన మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. కానీ త‌ర్వాత ప్ర‌భుత్వంలో  కూట‌మి భాగ‌స్వామిగా శివ‌సేన వుండి కూడా ప్ర‌తిప‌క్షాల మీద కంటే మోదీ, బిజెపీల మీదే ఎక్కువ విరుచుకుప‌డింది. 

2019లో బిజెపితో క‌లిసి పోటీ చేసినప్ప‌టికీ,  ఆ త‌ర్వాత బిజెపి ఝ‌ల‌క్ ఇచ్చి శ‌ర‌ద్‌ప‌వార్ ఎన్‌సిపితో జ‌త క‌ట్టింది. అప్ప‌టికి శివ‌సేన పెద్ద‌న్న స్థాయి కోల్పోయింది. కేంద్రంలో కాంగ్రెస్ స్థానంలో బీజేపీ వచ్చింది, మరాఠీ అస్మితపై ఆధిపత్యం చెలాయించే 'న్యూ' ఢిల్లీగా ఇప్పుడు సేనను చూస్తోంది బీజేపీ. ఎన్‌సిపి , కాం గ్రెస్‌లు శివసేనకు షరతులను నిర్దేశించే పరిస్థితిలో లేవు, కానీ బిజెపి ఆ పని చేయగలదు. శివ‌సేన‌, బిజెపి ల మ‌ధ్య సంక్షోభం కేవ‌లం రెండుపార్టీల మ‌ధ్య నెల‌కొన్న‌దిగా భావిస్తే దాని వెనుక వాస్త‌వాన్ని తెలుసుకో న‌ట్టే అవుతుంది. 

మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన తన మరాఠీ ప్రాంతీయ గుర్తింపును సమర్ధవంతంగా ఉపసంహరించు కోగల ఏ  అఖిల భారత పార్టీకి ద్వితీయ‌శ్రేణిగా వుండ‌ద‌ల‌చుకో లేదు. చారిత్రాత్మకంగా,  మరాఠాలు ఎప్పు డూ ఢిల్లీకి లొంగిపోలేదు. ఇద్దరూ నిరంతరం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటానికి ఛత్రపతి శివాజీ అతిపెద్ద చిహ్నం. బాలాసాహెబ్ థాకరే మరణంతో శివసేనను తారుమారు చేయవచ్చని  భావించినవారు సేన ఉనికికి గల ప్రాథమిక కారణాన్ని కోల్పోయారు. ఎక్కువ విద్యావంతులైన వలసదారులచే  అట్టడు గుకు నెట్టబడ్డారని భావించిన గొంతులేని మహారాష్ట్రీయులకు సేన వాయిస్ ఇచ్చింది.

ఉద్ధ‌వ్ నాయ‌క‌త్వాన్ని కాద‌ని తిరుగుబాటుకు నాయ‌క‌త్వం వ‌హించిన ఏక్‌నాథ్ షిండే  ఒక‌ప్పుడు మామూ లు  ఆటో డ్రైవ‌ర్‌. అస‌లా మాట‌కి వ‌స్తే,  శివ‌సేన నాయ‌కుల్లో ప్ర‌ముఖులంతా చిన్న స్థాయినుంచి ఎదిగిన వారే. మ‌రి ప్ర‌స్తుతం ఢిల్లీ గేమ్ ఆడుతున్నవాడిగా మ‌రాఠీ అస్మిత సింబ‌ల్‌గా అంద‌రి దృష్టిలో  ప‌డిన షిండేను ప్ర‌జ‌లు ఆద‌రిస్తారా ? 

మొత్తానికి, షిండే, అతని బృందానికి దీర్ఘకాలిక భవిష్యత్తు ఉంద‌నేది అంత‌గా అనిపించ‌ని సంగ‌తి.  ప్రస్తు తానికి, అతను విజేతగా కనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో, అతని సమూహం ఎప్ప‌టికీ మ‌రాఠా వాదానికి వెన్నుపోటు పొడిచిన ద్రోహులుగా  కనిపిస్తుంది.

ఉద్ధవ్ ఠాక్రే తన తండ్రి కంటే మృదుస్వభావి, ఎక్కువ అనుకూలత కలిగి ఉంటారనడంలో సందేహం లేదు. కానీ ఈ ఎపిసోడ్ థాకరే వారసత్వాన్ని నాశనం చేస్తుందని అనుకోవడం నిర్లక్ష్యమే. ఠాక్రే , మాతోశ్రీ, కేవలం పేరు లేదా నివాసం కాదు, వారు ఎల్లప్పుడూ కేంద్రం యొక్క శక్తిని ప్రతిఘటించే , ఎప్పుడూ లొంగిపోని ఆలోచనకు ప్రతీక. సింహం మ‌ళ్లీ పుంజుకుంటుంది.