'సూసైడ్ స్కీం' పెట్టమన్న తహశీల్దాద్.. షోకాజ్ నోటీసులు
posted on Jun 9, 2016 3:00PM

సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు స్కీంలు పెడుతుంటాయి. ఆ స్కీంలా మాదిరిగానే 'సూసైడ్ స్కీం' లాంటిది పెడితే.. వినడానికి చాలా ఆశ్చర్యంగా.. విచిత్రంగానూ ఉంది కదా. ఇలాంటి ప్రతిపాదనే చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని రాట్లం జిల్లా రావోటి మండలానికి చెందిన అమితా సింగ్ అనే వ్యక్తి తహశీల్దార్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన 'సూసైడ్ స్కీం' పెట్టాలని ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి సలహా ఇస్తూ.. తన ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. అంతే ఆ పోస్ట్ పై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న రాట్లం జిల్లా ఇన్ చార్జీ కలెక్టర్ హర్జీందర్ సింగ్ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
మోడీ ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ లో కూడా పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీకి పెద్ద ఎత్తున మద్దతు లభించగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ఓ సూసైడ్ స్కీం ఏర్పాటు చేయాలని.. దానికి ‘రాజీవ్ గాంధీ ఆత్మహత్య యోజన’ అని పేరు పెట్టాలని... మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు చెప్పుకుంటూ మాయగాళ్లుగా మారిన లౌకికవాదులకు ఈ స్కీంను వర్తింపజేయాలని కాస్తంత వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో దుమారం రేగింది.