ఎంపీల వేతనాలు 24శాతం పెంపు

పార్లమెంట్ సభ్యుల జీత భత్యాలు  భారీగా పెరిగాయి. ఈ మేరకు కేంద్రం అధికారిక ప్రకటన వెలువరించింది. తాజా పెంపుదల మేరకు ఏంపీలకు వేతనం 1.24 లక్షలు , రోజువారీ భత్యం రూ.2500 వరకూ పెరుగుతాయి.

ఇక మాజీ ఎంపీలకు అయితే  నెలవారీ పెన్షన్ రూ.31 వేలకు కేంద్రం సవరించింది.  అంటే మొత్తంగా ఎంపీల జీత భత్యాలను 24 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ పెరుగుదల రాజ్యసభ సభ్యులకు కూడా వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్రం సోమవారం (మార్చి 24)న నోటిఫై చేసింది.