రెడీ అవుతున్న లోకేష్ రెడ్‌బుక్!
posted on May 22, 2024 4:04PM
ఐదేళ్ళుగా లోపల్లోపల రగిలిపోతున్న అగ్నిపర్వతం బద్దలయ్యే సందర్భం రాబోతోంది. ‘లోకేష్ రెడ్‌బుక్’ రెడీ అవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు... వీటికి సహకరిస్తున్న ప్రభుత్వాధికారుల పేర్లు అన్నీ తన దగ్గర వున్న ‘రెడ్‌బుక్’లో చేరతాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్‌లో వున్న లిస్టు మీద తప్పకుండా చర్యలు... అది కూడా మైండ్ బ్లాక్ అయ్యే చర్యలు వుంటాయని లోకేష్ ఏనాడో ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చే సంకేతాలు పుష్కలంగా కనిపిస్తూ వుండటంతో లోకేష్ ‘రెడ్‌బుక్’లో లేటెస్ట్ ఎంట్రీలు వేస్తున్నారు. మొత్తం ఎవరెవరు ఎలాంటి దారుణాలకు పాల్పడ్డారు. ఏయే అధికారులు అక్రమాలకు ఎలా సహకరించారు... ఇలాంటి వివరాలన్నిటినీ రెడ్ బుక్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. తెలుగుదేశం అధికారం చేపట్టిన రోజునుంచే రెడ్ బుక్ పేజీల్లో ఎవరెవరి పేర్లు వున్నాయో... వారి పేజీలు చిరిగిపోవడం ప్రారంభమవుతుంది.