ఏపీలో ఎల్‌జీకి స్వాగతం..శ్రీసిటీలో రూ.5,800 కోట్ల పెట్టుబడులపై చంద్రబాబు హర్షం
posted on May 8, 2025 5:04PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీసిటీలో రూ.5,800కోట్లకు పైగా పెట్టుబడులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500పైగా ఉద్యోగాలతో ఈ సంస్థ ఏపీని ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ కింద ఈ సంస్థ 100శాతం ప్రోత్సాహకాలు పొందిందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది ఏపీలో పారిశ్రామిక వృద్ధికి ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికిందని పేర్కొంటూ శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌కు మంత్రి నారా లోకేశ్ నేడు శంకుస్థాపన చేసిన అనంతరం దిగిన ఫొటోను ముఖ్యమంత్రి షేర్ చేశారు.
తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కొత్త యూనిట్‌కు నేడు ఆయనభూమి పూజ నిర్వహించారు. ఈ యూనిట్ఏర్పాటు ద్వారా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ రూ.5,001 కోట్ల పెట్టుబడితో 2 వేల ఉద్యోగాలు కల్పించనుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్మాట్లాడుతూ దేశానికి 70 శాతం ఏసీలు ఏపీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఎల్జీ యూనిట్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక అభివృద్ధిలో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఉపాధి కల్పన చేస్తున్నామని లోకేశ్ తెలిపారు.