పార్టీ వ‌దిలిన‌వారితో రాజీనామా చేయించండి.. బండి డిమాండ్‌

ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా స‌రే రెచ్చ‌గొట్ట‌డం, హ‌డావుడి చేయ‌డం, అస్థిర‌త‌కు గురిచేయ‌డం బీజేపీవారికి వెన్న‌తో పెట్టిన విద్య‌. ప్ర‌స్తుతం బీజేపీ నాయ‌క‌త్వం అంతా తెలంగాణాపైనే ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. మునుగోడులో ఎలాగ‌యినా గెలిచి త‌మ స‌త్తా ఏమిట‌న్న‌ది కేసీఆర్ ప్ర‌భుత్వానికి చాటాల‌న్న ఆతృతే ఎక్కువ ప్ర‌ద‌ర్శిస్తున్నారు బండిసంజ‌య్ టీమ్‌. అందుకే  టీఆర్ ఎస్ పార్టీ ఉపఎన్నిక‌ల్లో పాల్గొన డానికి ముందే పార్టీ వ‌దిలేసిన వారితో రాజీనామా చేయించి యుద్ధంలోకి దిగాల‌ని ఆయ‌న టీఆర్ ఎస్‌కు ఓ ఛాలెంజ్ విసిరారు. 

మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తొమ్మిదో రోజైన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం, రామన్నపేట, దుబ్బాక, మునిపంపుల గ్రామాల్లో సంజయ్‌ పాద యాత్ర కొనసాగింది. ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ కేసీఆర్‌కు నైతిక విలువ‌లు ఉంటే ఎన్నిక‌ల్లో పోటీకి రావాల‌ని అన్నారు. 

ప్ర‌జ‌ల‌ను దోచుకోవ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. చేనేత బీమా, ఇంటికో ఉద్యోగం, రైతుల‌కు ల‌క్ష రూపాయ‌ల రుణ మాఫీ, ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమి హామీలన్నీ గాలికి వ‌దిలేశారా అని ప్ర‌శ్నిం చారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ల‌క్ష కోట్లు ఖ‌ర్చుచేశామ‌న్న కేసీఆర్ దాని వ‌ల్ల తెలంగాణా రైతాంగానికి  జ‌రి గిన ప్ర‌యోజ‌న‌మేమిటో తెలియ‌జేయాల‌ని డిమాండ్ చేశారు. 

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదిముర్మును ఓడించేందుకు కేసీఆర్‌ కాంగ్రెస్‌తో చేతులు కలిపాడని ఆరోపిం చారు. కేసీఆర్‌ అంటే ఖాసీం చంద్రశేఖర్‌ రజ్వీ అని, కేటీఆర్‌ అంటే సయ్యద్‌ మక్బూల్‌ అని ఎద్దేవా చేశారు. వీఆర్‌ఏలకు మద్దతు..రామన్నపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేస్తున్న ఆందో ళనకు సంజయ్‌ మద్దతు తెలిపారు.  పెట్రోల్‌, డీజిల్‌ గ్యాస్‌ ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ నాయ కులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. రామన్నపేటలో సంజయ్‌ ప్రసంగిస్తుండగా ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.