ప్రమాణ స్వీకారానికి లావణ్య త్రిపాఠి గైర్హాజరు.. కారణం అదేనా?

పవన్‌కళ్యాణ్‌ గత కొన్ని సంవత్సరాలు రాజకీయంగా చేస్తున్న కృషికి తగిన ఫలితం లభించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా తరలి వెళ్ళారు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి మాత్రం ఇంటి పట్టునే ఉంది. దానికి కారణం ఆమె కాలుకు అయిన గాయం. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ పోస్ట్‌ పెట్టింది. తన కుడికాలికి గాయమైందని, కోలుకుంటున్నానని చెబుతూ ఓ ఫోటో కూడా షేర్‌ చేసింది. 

పవన్‌కళ్యాణ్‌ విజయం సాధించిన తర్వాత తన వాళ్ళను కలుసుకునేందుకు మెగాస్టార్‌ నివాసానికి వచ్చినపుడు లావణ్య కాలికి ఎలాంటి కట్టు కనిపించలేదు. ఇప్పుడు చెబుతున్న గాయం షూటింగ్‌ సమయంలో అయిదా? లేక ఇంట్లోనే ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్‌కళ్యాణ్‌కి ఏ పదవి ఇస్తారనే విషయంలో క్లారిటీ రాలేదు. అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ వారి అభీష్టం మేరకే పదవులు కేటాయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని తెలుస్తోంది. అయితే పవన్‌కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం ఆఫర్‌ ఇచ్చారనే వార్త  ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే చిరంజీవి, అమిత్‌ షా, అఖిరా నందన్‌ వంటి వారు డిప్యూటీ సీఎంకి అభినందనలు అంటూ పోస్టులు పెట్టారు. అయితే పవన్‌కళ్యాణ్‌కి ఏ శాఖ ఇవ్వబోతున్నారనే విషయం ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉందని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ విషయం సస్పెన్స్‌లోనే ఉంటుంది.