భూసేకరణ బిల్లు సవరణకు లోక్ సభ ఆమోదం

 

ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి లోక్ సభ ఆమోదముద్ర వేసింది. గతేడాది యూపియే హయాంలో పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లులో ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా 11 సవరణలు చేసింది. అయితే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. లోక్ సభలో ఈ బిల్లుకి ఎన్డీయే భాగస్వాములయిన శివసేన, తెదేపా, అకాలీదళ్ పార్టీలు మద్దతు తెలుపగా కాంగ్రెస్, తెరాస మరియు బీజేడీ వ్యతిరేకిస్తూ సభ నుండి వాక్ అవుట్ చేసాయి. లోక్ సభలో ఎన్డీయే కూటమికి పూర్తి మెజార్టీ ఉంది కనుక అవలీలగా ఆమోదింప జేసుకోగలిగింది. కానీ రాజ్యసభలో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలదే బలం గనుక రాజ్యసభలో ఆమోదింపజేసుకోవడానికి ఎన్డీయే ప్రభుత్వం చాలా శ్రమ పడకతప్పదు.