Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రైతు బజార్‌లో కూరగాయలు కొని .. ఫోన్ పే చేసిన సీఎం చంద్రబాబు
posted on: May 17, 2025 9:11PM
.webp)
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుబజార్‌లో కూరగాయలు కొని ముఖ్యమంత్రి డిజిటల్ పేమెంట్ చేశారు. అనంతరం కూరగాయలు వ్యాపారి అయిన మహిళను ఫోన్ పే చేశాను అమ్మ ఒకసారి చెక్ చేసుకో సీఎం చంద్రబాబు అన్నారు. దీంతో సదరు వ్యాపారి సంతోషం వ్యక్తం చేసింది. స్వయనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెజిటేబుల్స్ కొనడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు.
కూరగాయల వ్యర్ధాలతో ఎరువుల తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మి నగర్‌లో ఉద్యానవన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో తానే రైతు బజార్ లను ఏర్పాటు చేశానని అన్నారు. కర్నూలులోని రైతు బజార్‌ను రూ.6 కోట్లు కేటాయించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో 175 రైతు బజార్‌లు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర, ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు అందిస్తామని సీఎం తెలిపారు.


.webp)



