ధర్నా బాటలో చిన్నదొర!

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేడు రంగారెడ్డి జిల్లా కందుకూరులో భారీ ధర్నా నిర్వహించనుంది.  మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ ధర్నాకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ హాజరౌతారు. ఈ ధర్నాలో ప్రధానంగా అర్హులైన రైతులందరికీ  పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేయనున్నారు.  ఇచ్చిన ఆరు హామీల అమలులో కాంగ్రెస్‌  ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ధర్నా ఏర్పాట్లపై పార్టీ నేతలతో చర్చించిన ఆమె  రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలయ్యే వరకు కాంగ్రెస్ సర్కార్ ను వదిలిపెట్టేది లేదని అన్నారు.