కేటీఆర్ పరాజయాల హ్యాట్రిక్!

కేసీఆర్ రాజకీయంగా క్రీయాశీలంగా లేరు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. పార్టీ బాధ్యతలను కేటీఆర్ స్వీకరించిన తరువాత  జూబ్లీ ఉప ఎన్నిక పరాజయంతో కేటీఆర్ వరుస వైఫల్యాలలో హ్యాట్రిక్ సాధించినట్లైంది. 

2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ పూర్తిగా క్రీయాశీల రాజకీయాలకు దూరమై, ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అడపాదడపా.. పార్టీ నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడినా, వారికి రాజకీయ దిశానిర్దేశం చేసినా గత రెండేళ్లుగా ఆయన తీరు చూస్తుంటే ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారని అనిపించక మానదు. 

సరే అది పక్కన పెడితే.. తండ్రి క్రీయాశీల రాజకీయాలకు దూరమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ తానై నడిపిస్తున్న కేసీఆర్ ఆ విషయంలో విఫలమయ్యారనే చెప్పాలి. జూబ్లీ ఉప ఎన్నిక ఓటమి ద్వారా కేటీఆర్ వరుసగా మూడు ఎన్నికలలో పార్టీని పరాజయం దిశగా సక్సెస్ ఫుల్ గా నడిపించారు. ఔను.. గత ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత నుంచీ కేసీఆర్ బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ కు అప్పగించి తాను క్రియాశీల రాజకీయాలకు విరామం ప్రకటించారు. అప్పటి నుంచీ బీఆర్ఎస్ బాధ్యతలన్నీ కేసీఆర్ తన భుజస్కంధాలపై పెట్టుకుని నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ జీరో స్కోర్ చేసింది. ఆ తరువాత కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పరాజయం పాలై సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి పరాజయాలలో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు పరాజయాలూ కేటీఆర్ ఖాతాలోనే పడ్డాయి.  

పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికలూ.. గత అసెంబ్లీ ఎన్నికలలో  బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన జీహెచ్ఎంసీ పరిధిలోనివి కావడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. అటువంటిది ఇప్పుడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయాలతో సత్తా చాటింది. దీంతో పార్టీ క్యాడర్ లో కేటీఆర్ నాయకత్వం పట్ల నమ్మకాన్ని సడిలేలా చేశాయి ఈ పరాజయాలు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News