కృష్ణపట్నంలో టాటా లెదర్ ఇండస్ట్రీ ఏర్పాటుకి సన్నాహాలు

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత చాలా త్వరగా కోలుకోనేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ ప్రయత్నంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐ.టి.పారిశ్రామిక అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏ.పి.ఐ.ఐ.సి.) మరియు లెదర్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ కలిసి నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం వద్ద లెదర్ ఇండస్ట్రీల స్థాపన కోసం ప్రత్యేకంగా కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసాయి. టాటా ఇంటర్నేషనల్ లెదర్ ప్రొడక్ట్స్ మరియు ఫాషన్ క్లబ్ గ్లోబల్ సంస్థతో సహా మొత్తం 46 లెదర్ ఇండస్ట్రీలు అక్కడ త్వరలో స్థాపించేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రూ. 2000కోట్ల పెట్టుబడితో స్థాపించబోతున్న ఈ సంస్థలు తమ కార్యకలాపాలు మొదలు పెడితే దాదాపు 15,000 మందికి ప్రత్యక్షంగా, అనేకవేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ స్థాపింపబడే లెదర్ ఇండస్ట్రీలలో తయారయ్యే ఫేషన్ ఉత్పత్తులు దేశ విదేశాలకు ఎగుమతులు చేయబడతాయి. ఈ పరిశ్రమల వలన రాష్ట్రంలో ఫేషన్ డిజైన్ రంగానికి కూడా మంచి ఊపు రావచ్చును.