జయలలిత ఎస్టేట్... డాక్యుమెంట్స్ చోరీ..
posted on Apr 28, 2017 11:33AM

ఇప్పటికే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్ వాచ్ మెన్ దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. అంతేకాదు జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు కూడా కొన్ని ధ్వంసం చేశారు. అయితే ఇప్పుడు ఈ ఘటనలో మరో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. ఎస్టేటులో ఉన్న జయలలిత, శశికళ గదుల్లో చోరీ జరిగిందని పోలీసులు గుర్తించారు. కొడనాడు ఎస్టేట్ లోని బంగ్లాలో జయలలిత, శశికళకు ప్రతేక గదులు ఉన్నాయి. సెక్యూరిటీ గార్డును హత్య చేసిన నిందితులు జయలలిత, శశికళ గదుల తాళాలు పగలగొట్టి రెండు సూట్ కేస్ లతో పాటు విలువైన పత్రాలు చోరీ చేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. అంతేకాదు 50 మంది పోలీసులతో కూడిన బృందం జయ ఎస్టేట్ లో తనిఖీలు నిర్వహించి.. ఈ చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు.