దేవుడా... కొడాలి నాని బతకాలి!

మేక ఆకులు నమిలినట్టు నాన్‌స్టాప్‌గా గుట్కా నమలటం, చీకటి పడిన దగ్గర్నుంచి నుంచి అర్ధరాత్రి దాటే వరకు  పీకల్దాకా తాగడం. నిద్ర లేచిన దగ్గర్నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు ఎవరో ఒకర్ని తిడుతూ వుండటం.... ఇదీ కొడాలి నాని దినచర్య. మరి ఇలాంటి లైఫ్ స్టైల్ వుంటే ఏమవుతుంది? ఎప్పుడో ఒకసారి సడెన్‌గా ఫ్యూజ్ కొట్టేస్తుంది. ప్రస్తుతం కొడాలి నాని ఫ్యూజ్ ఉండనా, కొట్టేయనా అన్నట్టుగా వుందని సమాచారం. గుడివాడలో గురువారం ఉదయం తన పార్టీ నాయకులతో మాట్లాడుతున్న నాని అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, ఆయనకు వైద్యులు చికిత్స అందించడం గురించి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా వుందనే సమాచారం లేదు. సకల కళా వల్లభుడైన కొడాలి నాని ఆరోగ్యం పాతాళానికి చేరుకుందని మాత్రం తెలుస్తోంది.

కొడాలి నాని తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘దేవుడా... కొడాలి నాని బతకాలి.. ఆయన మళ్ళీ మామూలు మనిషిలా అందరిలో తిరగాలి’’ అని పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. వాళ్ళ ప్రార్థనలు ఫలించి, దేవుడు కరుణించి కొడాలి నాని పూర్తిగా కోలుకుంటారని ఆశిద్దాం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఆయన కోలుకోవాలని కోరుకుంటున్న వాళ్ళు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కాదు.... టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. అదేంటీ అనుకుంటున్నారా... అదే కొడాలి నాని విలన్‌గా ‘రంగస్థలం-2’.

‘రంగస్థలం’ సినిమా చూసిన వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏమిటంటే, సినిమా మొదట్లో విలన్‌ని ఎవరో చంపబోతుంటే హీరో కాపాడతాడు. ఎందుకు కాపాడతాడంటే, దుర్మార్గుడైన విలన్‌కి ఎవరో శిక్ష విధించకూడదు.. తానే శిక్ష విధించాలి. అందుకోసమే కాపాడాడు. అలాగే, కొడాలి నాని విలన్ అయిన పొలిటికల్ ‘రంగస్థలం-2’ ప్రకారం, ఇప్పుడు కొడాలి నానికి ఏమైనా అయితే, ఆయన చేసిన పాపాలన్నిటికీ శిక్ష ఎలా అనుభవిస్తాడు? అందుకే, ఆయన బతికుండాలి, గుడివాడ నియోజకవర్గంలో తన ఓటమిని స్వీకరించాలి. ఆ తర్వాత ఆయన చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి. అప్పటి వరకూ ఆయన క్షేమంగా వుండాలి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu