కొడాలి నానికి తీవ్ర అస్వస్థత
posted on May 23, 2024 3:08PM
గుడివాడ సిట్టింగ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ( మే 23) తన నివాసంలో పార్టీ మండల స్థాయి నాయకులతో మాట్లాడుతున్న సమయంలో ఒక్క సారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే నేతలు, గన్ మెన్ లు వైద్యులకు సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కొడాలి నాని గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరన్న వార్తలు ఇటీవలి కాలంలో గట్టిగా వినిపించాయి. ఆయన రెండుమూడు సార్లు హైదరాబాద్ లోని బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చినప్పటి ఫొటోలు కూడా మీడియాలో వచ్చాయి. అయితే తన అనారోగ్యం విషయం నాని ఎప్పడూ చెప్పలేదు. ఇప్పుడు ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఆయన అనారోగ్యం ఏమిటన్నదానిపై చర్చ మొదలైంది.