దారుణం...ఆస్పత్రిలోనే మహిళపై అత్యాచారం...

 


యూపీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆస్పతిలోనే ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిపారు. వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్‌ లోని హర్దోయి నగరానికి చెందిన ఓ మహిళ.. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు చికిత్స చేయించడానికి లక్నోలోని కింగ్‌ జార్జి మెడికల్‌ యూనివర్సిటీకి వచ్చింది. రెండు రోజుల క్రితం తన భర్తను ఆస్పత్రిలో చేర్పించిన ఆమె.. ఈ క్రమంలో రాత్రి భర్తకు ఆహారం తీసుకువచ్చేందుకు వెళ్తుండగా... ఆమెను లిఫ్ట్‌ ఆపరేటర్‌ వినయ్‌, సెక్యూరిటీ గార్డు శివ్‌కుమార్‌తో పాటు సంతోష్‌ అనే వ్యక్తి బలవంతంగా లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్‌, శివ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న వినయ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu