తిరుపతిలోకి ప్రవేశించిన కేరళ నరహంతకుడు
posted on Jul 16, 2012 12:21PM
ఆంద్రప్రదేశ్ పోలీసులు సైకో సాంబను పట్టుకోవడానికి ముప్పుతిప్పలు పడుతుంటే, కొత్తగా మరో సైకో మన రాష్ట్రంలోకి ప్రవేశించాడు. కేరళ, తమిళనాడులో నరహంతకుడిగా చలామణి అవుతున్న ఆంటోని తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నట్లు కేరళ పోలీసులకి సమాచారం అందింది. దీంతో కేరళ పోలీసులు నరహంతకుడు ఆంటోని కోసం తిరుపతికి వచ్చారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆంటోని తిరుపతిలో ఉన్నట్లు కేరళ పోలీసులు తెలుసుకున్నారు. నరహంతకుడు ఆంటోని కోసం రేణిగుంట ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఆంటోనిపై 20కి పైగా కేసులు ఉన్నాయట, గత నెలలో ఆంటోని కేరళలోని పొల్లం జిల్లా యందువారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ వాహనంపై దాడి చేసి ఎస్‌ఐ జోయిని కత్తితో పొడవటమే కాకుండా పోలీస్ డ్రైవర్ మునియన్ పిళ్లైను దారుణంగా హతమార్చాడు. ఇప్పటిదాకా ఈ ఆంటోని 17 మందిని పెళ్ళి చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సైకో ఆంటోని అయినా కేరళ పోలిసులులకి త్వరగా చిక్కుతడేమో చూద్దాం!