కేసీఆర్ చాలా బిజీ... కేంద్రాన్ని కరెంట్ అడగలేదట...

 

తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన కరెంట్ కొరత వున్న విషయం తెలిసిందే. ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద వుంది. అయితే అడగందే అమ్మైనా పెట్టదంటారు. కేంద్రాన్ని అడిగితేనే ఏ పనైనా జరిగేది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి చాలా బిజీ అని, ఆయన తమను కరెంట్ కావాలని అడగనే లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు త్వరలోనే 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ అడిగితే తెలంగాణలో కూడా విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు గోయల్ చెప్పారు. విద్యుత్ విషయంలో తాము రాజకీయాలు చేసే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు.