కేసిర్! కలిసి చద్దాం... రా!

 

ఇంకా సాధారణ ఎన్నికలు ఏడాది పైమాటే అయినా అప్పుడే రాజకీయపార్టీలు తెలంగాణా జిల్లాలపై పట్టుకోసం గట్టిప్రయత్నాలు ప్రారంబించేసాయి. చాప క్రింద నీరులా చేరి తెలంగాణాలో నెమ్మదిగా బలపడుతున్న జగన్ పార్టీని చూసి తే.ర.స. ఆందోళన చెందుతున్నట్లే, రాబోయే ఎన్నికలలో అన్ని శాసనసభ, లోక్సభ స్థానాలకి తే.ర.స. పోటీ చేయబోతోందని తెలిసిన జగన్ పార్టీకూడా అంతే ఆందోళన చెందడం సహజం. తెలంగాణాపై పూర్తీపట్టు సాదించేందుకు మొదలు పెట్టిన ప్రయత్నాలలో బాగమే నేడు కేసిర్ కొండసురేఖల మద్య జరుగుతున్న మాటలయుద్ధం. అది చివరికి హింసాత్మకంగా మారిపోయి, రేపు ఎన్నికల సమయం పరిస్తితులు ఏవిదంగా ఉండబోతున్నాయో ఇప్పుడే తెలియ జేస్తున్నాయి.

 

కొద్ది రోజుల క్రితం, జగన్ పార్టీ నాయకురలయిన కొండసురేఖ ఒక బహిరంగసభలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “తే.ర.స. అధినేత కేసిర్ ఇక్కడే గత ఎన్నికల సమయంలో సరిగ్గా వందరోజుల్లో తానూ తెలంగాణా సాదించి తెస్తానని వాగ్దానం చేసాడు. గానీ, ఏడాదయినా ఇంతవరకు తెలంగాణా ఊసేలేదు. అతను ఇప్పుడు మళ్ళీ కొత్త పల్లవి అందుకొని వచ్చే ఎన్నికలలో మొత్తం శాసనసభ, లోక్ సభ స్థానాలన్నిటిలో తన పార్టీనీ ప్రజలు గెలిపిస్తే అప్పుడు తప్పక నెలరోజుల్లోనే తెలంగాణా సాదించి తెస్తానని బూటకపు వాగ్దానాలు చేస్తున్నాడు. తెలంగాణా కోసం అవసరమయితే తన తలకూడా నర్రుకోవడానికి సిద్దం అని బీకర ప్రతిజ్ఞ చేసిన ఇంతవరకూ తెలంగాణా సాదించలేకపోయినా అతను ఇంకా బ్రతికే ఉన్నడేమిటి? అతని మాయమాటలు నమ్మి అమయకులయిన పిల్లలు ప్రాణాలు తీసుకొంటున్నారు. అతనేమో డిల్లీలో ప్యాకేజీలు మాట్లాడుకొంటూ తెలంగాణా పేరుతో ప్రజలని ఇంకా మోసం చేస్తునే ఉన్నాడు. అతను బ్రతికిఉండగా తెలంగాణా మాత్రం రాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. తెలంగాణా అనేది అతనికి, అతని బందువులకీ, అతని పార్టీవారికీ ఒక రాజకీయ ఉపాదిగా మారింది. వారిలో తెలంగాణా పట్ల చిత్తశుద్ది అసలు లేదు,” అని అంది ఆమె.

 

ఆమె మాటలకి వెంటనే స్పందిస్తూ “సీమంద్రా పార్టీలవెంట తిరిగే నీ వంటివారే ముందు ఆత్మహత్య చేసుకొని చావాలి, నేను కాదు,” అని ఘాటుగా ఆమెకి జావబిచ్చేడు కేసిర్.

 

దానికి కొండసురేఖ కూడా అంతే ఘాటుగా స్పందిస్తూ “తెలంగాణాకోసం నేను ఆత్మా హత్య చేసుకోవడానికి సిద్దం. నీవు సిద్దమేనా? దైర్యం ఉంటే ఇద్దరం పురుగుల మందు సీసాలు చేత్తుల్లో పట్టుకొని డిల్లీ వెళ్లి , తెలంగాణా ఇవ్వని సోనియాగాంధీ ఇంటిముందే ఒకేసారి ఆత్మహత్య చేసుకొందాము. దమ్ముంటే రా! అని కేసిర్ కి ప్రతిసవాల్ విసిరింది ఆమె.

 

ఈ సవాళ్ళు ప్రతిసవాళ్ళు వారిమద్య ఒక వైపు కొనసాగుతుండగానే, మరోవైపు దానికి ఎలెక్ట్రానిక్ మీడియా ఆజ్యంవేస్తూ తనవంతు తానూ అగ్గిరాజేస్తూ పోయింది. దానితో ఇరు పార్టీల నుండీ మరింతమంది కార్యకర్తలు, నేతలు మీడియా ముందుకి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టేసరికి, ఒక్కసారిగా కొండసురేఖ నివాసముండే వరంగల్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు మొదలయ్యాయి. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు భౌతికదాడులకి దిగడమే గాకుండా ఒకరి కార్యాలయాలపై మరొకరు దాడి చేసుకొన్నారు కూడా.

 

ముందుగా తే.ర.స. కార్యకర్తలు వరంగల్ మరియు కరీంనగర్ లలో ఉన్న జగన్ పార్టీ కార్యలయాలపై దాడిచేసి విద్వంసం సృష్టించేరు. దానికి ప్రతిగా జగన్ పార్టీ కార్యకర్తలు కూడా వరంగల్లో ఉన్న తే.ర.స. కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న తే.ర.స. కార్యకర్తలకీ వారికీ మద్య యుద్ధం మొదలయింది. పోలీసులు లాటీ చార్జ్ చేయవలసిన పరిస్తితులు ఏర్పడాయంటే పరిస్తితి ఎంత తీవ్రంగా ఉందొ అర్ధం అవుతుంది.

 

ఇక, మాటలయుద్ధం ఈవిదంగా చేతలయుద్ధంగా మారడమంటే మున్ముందు ఇంతకంటే బీకర పోరాటాలు ఉండబోతున్నాయని ఒక హెచ్చరికగా కనిపిస్తోంది.

 

ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఇంకా రంగంలోకి దిగలేదు. జగన్ పార్టీ కంటే తెలంగాణాలో చాల పటిష్టమయిన క్యాడర్ కలిగిఉన్న, ఆ పార్టీతో కూడా తే.ర.స. ఇదే విదంగా వీదిపోరాటాలకి దిగినట్లయితే అప్పుడు పరిస్తితులు ఇంతకంటే దారుణంగా ఉండవచ్చును. ఈ మూడు రాజకీయ పార్టీలకు కూడా వచ్చే ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమయినవి గనుక తెలంగాణాపై పూర్తీ పట్టు సాదించేందుకు ఈ మూడు పార్టీలు ఇంకా తీవ్ర యుద్దాలకి దిగవచ్చును. అదే జరిగితే తెలంగాణా రాష్ట్ర సమస్య మరింత జటిలమవుతుందే తప్ప రాష్ట్రం ఏర్పడటం సాద్యం కాదని కేసిర్ మరియు తెలంగాణవాదులు తెలుసుకోవాలి.

 

కేసిర్ మనస్పూర్తిగా తెలంగాణా కోరుకొంటున్నట్లయితే తెలుగుదేశం, కాంగ్రెస్ మరియు జగన్ కాంగ్రెస్ పార్టీలను ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలో ఎదుర్కొని ఓడించి తన ఆశయ సాధన చేయవచ్చును. గానీ, ఈ విదంగా బౌతికదాడులకి దిగి తెలంగాణా అంతటా అరాచక పరిస్తితులు కల్పిస్తే ముందుగా నష్టపోయేది తెలంగాణా ప్రజలు మాత్రమే. ఇప్పటికే తెలంగాణా సమస్యని సాగ దీయాలని చూస్తున్న కాంగ్రేసుపార్టీకి వారు చేజేతులా ఒక చక్కటి అవకాశం అందజేసినవారవుతారు. అక్కడి అరాచక పరిస్థితులను సాకుగా చూపించి తెలంగాణా ఇవ్వడం సాద్యం కాదని కాంగ్రెస్ తప్పుకొనే అవకాశాన్ని కేసిర్ కల్పించినట్లే అవుతుంది.

 

ఇప్పుడతను, అతని పార్టీ తెలంగాణా కావాలని కోరుకొంటున్నారో లేక వచ్చే ఎన్నికలలో గెలవడమే ప్రధానం అని అనుకొంటున్నారో ముందుగా తేల్చుకోవాలి. దానిని బట్టే పరిస్తితులూ, ఫలితాలు ఉంటాయి. తెలంగాణా కోరుకోన్నట్లయితే అతను ముందు ఆఅంశం పైనే దృష్టి కేంద్రీకరించి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వచ్చేఎన్నికలలో గెలుపే ప్రధానం అనుకొంటే ఇదేవిదంగా అన్నిపార్టీలతో మరిన్ని యుద్దాలు చేయాల్సి రావచ్చును. తెలంగాణానా లేక ఎన్నికలా? అనేది తెల్చుకోన్నాక అతను ఆదిశలో అడుగులువేస్తె త్వరగా సత్ఫలితాలు రాబట్ట వచ్చును.

 

అయితే, తెలంగాణా కోసమే ఎన్నికలకి వెళ్తున్నామంటే మాత్రం తెలంగాణా ప్రజలు కూడా నమ్మరు. మిగిలిన పార్టీలుకూడా అప్పుడు కొండసురేఖ వలెనే కేసిర్ మరియు అతని పార్టీ సహచరులపై ‘తెలంగాణా పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని గట్టిగ ప్రచారం చేసుకొనే అవకాశం ఉంది.’ అప్పడు వారిలో మరింత అసహనం పెరిగి చివరికి ఇప్పటి లాగానే మళ్ళీ వీది పోరాటాలు మొదలవుతాయి.

 

ఏది ఏమయినా అంతిమంగా నష్ట పోయేది మాత్రం తెలంగాణా ప్రజలు మాత్రమె. రాజకీయ పార్టీలు మాత్రం కాదు.