కాన్పూర్‌లో లాకప్ డెత్..స్టేషన్ మొత్తం సస్పెండ్
posted on Aug 5, 2016 11:31AM

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దొంగతనం కేసులో విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకొచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడమే ఉద్రిక్తతలకు కారణం. కమల్ వాల్మీకి అనే వ్యక్తిని ఇటీవల దొంగతనం కేసులో విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే వాల్మీకి లాకప్‌లో ఉరివేసుకుని మరణించాడని, మృతదేహన్ని తీసుకెళ్లాలని కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అయితే అతడిది ఆత్మహత్య కాదని..పోలీసులే కొట్టి చంపిఉంటారని కుటుంబస భ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అతని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు..ఘటన జరిగిన పీఎస్‌లోని మొత్తం 14 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ నివేదిక వస్తే కాని అసలు విషయం తెలియదు.