పిఠాపురంలో క్షుద్ర పూజలు కలకలం..ఐదు నెలల చిన్నారి బలి

 

కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. క్షుద్రపూజలు కోసం ఐదు నెలల చిన్నారిని  బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లో తల్లి ప్రక్కలో నిద్రిస్తున్న చిన్నారిని తీసుకెళ్లి అర్ధరాత్రి ప్రక్క ఇంటి బావిలో పడేయగా చిన్నారి మృతి చెందింది. అయితే అర్ధరాత్రి తల్లి మేల్కొనగా పాప పక్కన కనిపించలేదు. గుమ్మం దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కనిపించడం గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే చుట్టుపక్కల వెతుకున్న వారికి ప్రక్కింటి బావిలో చిన్నారి మృతదేహాం లభించింది. ఈ సంఘటనపై స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షుద్రపూజల కోసమే ఈ హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కుటుంబ సభ్యుల సమాధానాల్లో పొంతన లేకపోవడం, వారి ప్రవర్తన మీద విచిత్ర అనుమానాలు కలుగజేస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు. చిన్నారి మృతికి కుటుంబ సభ్యులే కారణమై ఉండొచ్చన్న  కొందరు చెబుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నారి తండ్రితోపాటు తాయయ్యలను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిజాన్ని వెలికితీయేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో భయం, వణుకు పుట్టించిన ఈ ఘటనపై అధికారులు మరింత స్పష్టత కోసం కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu