జస్టిస్‌ కర్ణన్‌ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు..

 

కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ ప్రస్తుతం కోర్టు ధిక్కార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.  కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలని, తీర్పుపై న్యాయస్థానం తన ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరుతూ జస్టిస్‌ కర్ణన్‌ పిటిషన్‌ వేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారించేందుకు సుప్రీంకోర్టు... తిరస్కరించింది. ‘తీర్పుపై లిఖితపూర్వకంగా గాక, నేరుగా అభ్యర్థించడాన్ని అంగీకరించబోం. అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా కోర్టు ధిక్కార కేసులో జస్టిస్‌ కర్ణన్‌కు ఆరు నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ.. మే 9న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu