మోడీని చినజీయర్ ఎవరితో పోల్చాడో తెలుసా?

ముచ్చింతల్ లో రామానుజుల విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించిన తరువాత చేసిన ప్రసంగంలో చినజీయర్ స్వామి... మోడీ గుణగణాలను అద్భుతమైన పదాలతో అభివర్ణించారు. ఏకంగా మోడీని రాముడితో పోల్చారు. రామాయణంలో రాముడికి వాల్మీకి ఎన్ని గుణాలున్నాయని పేర్కొన్నారో... అవన్నీ మోడీలో ఉన్నాయన్నారు. మోడీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కూడా మన దేశ ధర్మాన్ని విడిచిపెట్టలేదన్నారు. అలాగే రామానుజల విగ్రహావిష్కరణ కోసం వచ్చినప్పుడు కూడా వైష్ణవ సంప్రదాయాన్ని చిత్తశుద్ధితో, మనస్పూర్తిగా ఆచరించి.. తనలో ఉన్న హిందూ ధర్మనిష్టను చాటుకున్నారన్నారు.

నేను హిందువునని గర్వంగా చెప్పుకునే మోడీ... యావత్ హిందూ జాతికి, హిందూ ధర్మానికి సేవకుడిగా, ప్రతినిధిగా ఎదగడం ఎంతో గర్వంగా ఉందన్నారు. మోడీ ప్రధాని అయ్యాకే ఈ భూమాత, భారతమాత కాశ్మీర్ ను తిరిగి పొంది తలత్తుకుని గర్వంగా నిలబడి ఉందని ఎంతో కొనియాడారు. అయోధ్యా రాముడు తల వంచుకున్నప్పుడైనా.. తల ఎత్తుకున్నప్పుడైనా ధర్మాన్ని ఆశ్రయించుకునే ఉన్నాడని, మోడీ కూడా అలాంటి రాముడేనంటూ ఆనందం వ్యక్తం చేశారు. హిందువులనే కాకుండా అన్ని ధర్మాలను కలుపుకొని పోతూ సబ్ కే సాథ్.. సబ్ కా వికాస్ అన్న నినాదంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu