రామోజీరావు గురించి అసలు నిజం తెలుసుకోండి.. మీకే ఉపయోగం 

సహజ నటి జయసుధ (jayasudha)నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మాములుగా ఒక హీరోయిన్ నటన గురించి చెప్పుకోవాల్సి వస్తే  పలానా క్యారక్టర్ లో  మాత్రమే ఆమె  బాగా చెయ్యగలదు. పైగా వాటికే సూటవ్వుతుందనే మాటలు  వినిపిస్తాయి. కానీ జయసుధ విషయంలో మాత్రం అలాంటి మాటలు ఉండవు. అన్ని పాత్రల్లోను విజృంభించి నటిస్తుంది. తాజాగా ఆమె దివంగత రామోజీ రావు (ramoji rao)గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది.

జయసుధ రామోజీ ఫిలింసిటీ లోని రామోజీ స్వగృహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు రామోజీరావు గారి గురించి ఎంత చెప్పుకున్నా సరిపోదు. స్వయం కృషి తో ఎదిగి ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారు. అదే విధంగా ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించి ఇండియన్ సినీ పరిశ్రమకే ఒక ది క్సుచి లా ఉన్నారు. నా సినీ జర్నీ లో ఆయన పాత్ర చాలా  ఉంది. ఆయన నిర్మించిన చాలా సినిమాల్లో నటించాను. ఈటి వి ఛానెల్  ప్రారంభించినప్పుడు ప్రమోషన్స్ కూడా చేశాను. జయసుధ తో చేయించాలని ఆయనే చెప్పాడు.

 

అలాంటి ఆయన ఇప్పుడు లేడంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడున్న జనరేషన్ తో పాటు  రాబోయే జనరేషన్ మొత్తం  రామోజీ రావు గారి లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలి..తెలుసుకోవడంతోనే కాకుండా  నేర్చుకోవాలి కూడా. అదే విధంగా ఒక పాఠం లాగా చదవాలి. దాంతో ఎంతో మంది  యంగర్ జనరేషన్ వారి  లాగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పింది.