శశికళకు ఓట్లు వేయం: ఆర్కేనగర్ ప్రజలు
posted on Jan 6, 2017 10:09AM
.jpg)
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తర్వాత ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు చాకచక్యంగా పావులు కదుపుతున్నారు అమ్మ స్నేహితురాలు శశికళా నటరాజన్. ప్రస్తుతానికి అన్నాడీఎంకే అధినేత్రిగా పగ్గాలు చేపట్టి..నెక్ట్స్ ఫోకస్ సీఎం కుర్చీపై పెట్టారు శశి. ఈ నేపథ్యంలో జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని శశికళ భావిస్తున్నారు. అమ్మపై ఉన్న సానుభూతి తనకు కలిసివస్తుందని భావిస్తున్న శశికళకు ఆర్కేనగర్ వాసులు షాకిచ్చారు. వివరాల్లోకి వెళితే జయలలిత మరణించి 30 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఆర్కేనగర్ అన్నాడీఎంకే నేత, న్యాయవాది పీ వెట్రివేల్ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన జరిగింది. ఈ క్రమంలో కొంతమంది ప్రజలు శశికళపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేము అమ్మకు మాత్రమే విధేయులం..చిన్నమ్మకు చెప్పండి..ఆమె వస్తే మేము ఓట్లు వేయం అని మొహం మీదే చెప్పారు..జయ ఆసుపత్రిలో 77 రోజులు ఉంటే ఒక్కసారి కూడా ఆమెను మాకు చూపని శశికళకు మద్దతిచ్చేది లేదన్నారు.