హర్యానా బీజేపీకే, కాశ్మీర్‌ కాంగ్రెస్ మిత్రపక్షానిది!

సర్వేలు పటాపంచలయ్యాయి. హర్యానాలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రపతి పాలన ముగిసిన తర్వాత ఎన్నికలు జరిగిన జమ్ము అండ్ కాశ్మీర్‌లో కాంగ్రెస్ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వచ్చింది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, జమ్ము కాశ్మీర్‌లో హంగ్ వస్తుందని సర్వేలు ఊదరగొట్టాయి. కానీ, రెండు రాష్ట్రాల్లోనూ సర్వేలు ఫెయిలయ్యాయి. 

హర్యానాలోని మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 39, కాంగ్రెస్, మిత్రపక్షాలు 36, ఐఎన్ఎల్‌డి మిత్రపక్షాలు 2, ఇతరులు 3 స్థానాలు గెలుచుకున్నారు. జమ్ము కాశ్మీర్‌లోని 90 స్థానాల్లో జమ్ము కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాలు, బీజేపీ 29 స్థానాలు, జమ్ము కాశ్మీర్ పీడీపీ 3 స్థానాాలు, కాంగ్రెస్ 6 స్థానాలు, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు. హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 45 స్థానాలను ఒంటరిగానే పోటీ చేసిన బీజేపీ సాధించింది. కాశ్మీర్లో కూడా మేజిక్ ఫిగర్ 45 స్థానాలకు  మూడు స్థానాలకు తక్కువ పొందిన జమ్ము కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ తన మిత్రపక్షం కాంగ్రెస్ సంపాదించిన 6 స్థానాలతో కలిపి మేజిక్ ఫిగర్‌ సంపాదించగలిగింది.