అధినేత రుషికొండకు గుండు కొడితే.. ఆళ్ల ఉండవల్లి కొండనే మింగేస్తున్నారు!

దోపిడీ, దగా, దాడులతోనే జగన్ పాలన సాగుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనబడుతోందనీ, కానీ ఈ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం చేపట్టిన ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనిని చూపించగలరా అని లోకేష్ సవాల్ విసిరారు.

దేవన కొండ చెరువు వద్ద సెల్ఫీ దిగిన లోకేష్.... ఈ చెరువు ఒకప్పుడు ఎండిపోయి ఉండేదనీ.  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక హంద్రీ నీవా జలాలతో  చెరువును అనుసంధానం చేశామని వివరించారు.  దీంతో దేవనకొండ పట్టణానికి తాగునీరు సహా పల్లెదొడ్డి, గెద్దరాళ్ల గ్రామాల్లో  భూగర్భ జలాలు పెరిగి  బోర్లకు పుష్కలంగా నీరు అందుతోందన్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఘనత. ఇలా చెప్పుకోవడానికీ, చూపించడానికీ నీ పాలనలో ఒక్కటంటే ఒక్క పని చేశావా జగన్ అని సవాల్ చేశారు. ఇలా ఇదీ తమ ప్రభుత్వం సాధించిందని చెప్పుకుని సెల్ఫీ దిగే దమ్ము జనగ్ కు ఉందా అని లోకేష్ పేర్కొన్నారు. ఇక విశాఖలోని రుషి కొండకు జగన్ గుండు కొడితే.. ఆ పార్టీకే చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా ఉండవల్లి కొండనే మింగేశాడని లోకేష్ ఆరోపించారు. 

ఇది మా ప్రభుత్వం ఘనత.  సహజ వనరుల దోపిడీలో వైసీపీ నేతలు ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా తయారయ్యారనీ, అందరూ ఈ విషయంలో తమ అధినాయకుడు  జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నట్లు కనిపిస్తోందన్నారు.  

సిఎం ఇంటికి కూత వేటు దూరంలో ఆళ్ల మైనింగ్ మాఫియా యధేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతోందన్నారు. అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మైనింగ్ మాఫియా బెదిరింపులకు భయపడకుండా పోరాడి కొండ పై జరుగుతున్న గ్రావెల్ లూటీని బయటపెట్టిన మంగళగిరి టిడిపి నాయకులని, కార్యకర్తల్నిలోకేష్ అభినందించారు.