బెంగళూరులో రాహుల్‌గాంధీ-జగన్ రహస్య భేటీ!
posted on Aug 12, 2024 11:49PM
జగన్ మొన్న హడావిడిగా బెంగళూరుకు ఎందుకు వెళ్ళాడో ఇప్పుడు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో జగన్ సోమవారం రాత్రి బెంగళూరులో రహస్యంగా సమావేశం అయినట్టు తెలిసింది. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతోపాటు పలు అంశాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్ కొన్ని గొంతెమ్మ కోర్కెలు కోరగా, రాహుల్ గాంధీ వాటికి ‘నో’ అన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి డిమాండ్లు చేయడం వల్లే గతంలో నువ్వు కాంగ్రెస్ పార్టీకి దూరమైపోయి, ఇప్పుడిలా రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయావని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా అన్నట్టు సమాచారం. నీ పార్టీని బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో కలిపేయ్.. నీ సంగతి నేను చూసుకుంటానని జగన్‌తో రాహుల్ గాంధీ అన్నట్టు తెలుస్తోంది. మనం మరోసారి కలుద్దాం.. ఈలోపు నువ్వు బాగా ఆలోచించుకో అని రాహుల్ గాంధీ సమావేశానికి ఫుల్‌స్టాప్ పెట్టినట్టు తెలుస్తోంది.