జగన్ కు బెయిలా?, కస్టడీనా?
posted on May 29, 2012 10:44AM
జగన్ భవితవ్యం నేడు తేలిపోనుంది. నేడు బెయిల్ కోసం జగన్ సిబిఐ కోర్టుకు వెళ్ళుతుండగా, జగన్ ను కస్టడీకి అప్పగించాలని సిబిఐ హై కోర్టుకు వెళ్ళుతుంది. జగన్‌ను కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌నూ నిన్న సిబిఐ కోర్టు తిరస్కరించింది, దీనితో హైకోర్టుకు వెళ్ళాలని సిబిఐ నిర్ణయించుకుంది. జగన్మోహన్ రెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఆస్తుల కేసులో వైఎస్ జగన్, జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య, ఫార్మా కంపెనీల అధినేతలు కలిపి మొత్తం 13మంది నిందితులు హాజరయ్యారు. ఇందులో జగన్, విజయసాయిరెడ్డిని మినహాయించి మిగిలిన 11మందికి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. సిబిఐ ఆదేశించినప్పుడు హాజరై విచారణకు సహకరించాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.