ఇలాంటి అజ్ఞానిని మనం భరించాం!

ప్రపంచ ప్రఖ్యాత గ్యాంగ్‌స్టర్, డ్రగ్స్ వ్యాపారి, క్రిమినల్ ఎస్కోబార్ గురించి తెలియకపోవడం పెద్ద తప్పేమీ కాదు. ఈ ప్రపంచంలోని అందరు వ్యక్తులూ అందరికీ తెలియాలని రూలేమీ లేదు. విజయవాడలో హోటల్ నడుపుకునే వ్యక్తిని ‘నీకు పాబ్లో ఎస్కోబార్ తెలుసా?’ అని అడిగితే అతను తెలియదని అనడం తప్పేమీ కాదు. మన్యంలో కూలీపని చేసుకునే వ్యక్తిని ఈ ప్రశ్న అడిగితే, అతను ‘తెలియదు’ అని సమాధానం ఇస్తే తప్పు కానే కాదు. సంసార బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక అక్కనో, చెల్లినో ఈ ప్రశ్న అడిగితే ఆమె ‘తెలియదు’ అని సమాధానం చెబితే అది తప్పు కానే కాదు. అంతెందుకు? రీసెంట్‌గా బీటెక్ పాసై, భారీ జీతానికి సాఫ్ట్.వేర్ ఉద్యోగం చేస్తున్న యూత్‌ కూడా ఈ ప్రశ్నకు ‘తెలియదు’ అని సమాధానం ఇస్తే, అదీ తప్పు కాదు. కానీ, మొన్నటి వరకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి పాబ్లో ఎస్కోబార్ పేరు తెలియకపోతే  మాత్రం క్షమించరాని తప్పు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రకటించినప్పుడు జగన్ని అంతర్జాతీయంగా చెడ్డ పేరు వున్న డ్రగ్స్ వ్యాపారి, హంతకుడు, క్రిమినల్ పాబ్లో ఎస్కోబార్‌తో పోల్చారు. అంతే, ఈ పాయింట్‌ని నేషనల్ మీడియా అందుకుంది. జగన్‌ని చంద్రబాబు నాయుడు ఎస్కోబార్‌తో పోల్చారని, జగన్ ఈజ్ ఆంధ్రా ఎస్కోబార్ అని భారీ స్థాయిలో కథనాలు ప్రసారం చేసింది. జగన్‌కి ఇవన్నీ ఆయన భజనపరులు చెప్పరో, చెప్పినా తెలియనట్టు నటిస్తారో గానీ, జర్నలిస్టులు జగన్ దగ్గర ఎస్కోబార్ ప్రస్తావన తెచ్చినప్పుడు జగన్ పాబ్లో ఎస్కోబార్ పేరుని పలకడానికే తికమకపడిపోయినట్లు, ఆ పేరు జీవితంలో ఏనాడూ విననట్టు వ్యవహరించాడు. జగన్ ఈ విషయంలో తన అమోఘమైన నటన ప్రదర్శించాడని అనుకోవడం లేదు. ఎందుకంటే, ఈ మొహానికి నిజంగానే ఎస్కోబార్ ఎవరో తెలిసి వుండదు.

తండ్రి, తాత సంపాదించిన డబ్బు, తండ్రి పేరుని అడ్డు పెట్టుకుని తాను తాను సంపాదించిన డబ్బు, వెంట వుండే క్రిమినల్ బ్యాచ్, చెప్పినట్టు చేసే రాయలసీమ గ్యాంగ్‌లు.. వీటి సహాయంతోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప, అయ్యగారికి చదువు లేదు, సంస్కారం లేదు, పరిజ్ఞానం లేదు, విచక్షణా జ్ఞానం అంతకన్నా లేదు. అందినచోటల్లా అప్పు చేయడం, బటన్లు నొక్కడం తప్ప ఏమీ తెలియదు. ఐదేళ్ళ పదవీ కాలంలో అప్పులు చేయడం తప్ప, సొంతగా ప్లాన్ చేసి రాష్ట్రం కోసం ఒక్క రూపాయి కూడా సంపాదించని ఏకైక ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే, మన జగనయ్య. 

ఇలాంటి వ్యక్తికి శరీరంలో సిగ్గు ఎంతమాత్రం లేకపోవడం బాగా కలిసొచ్చిన అంశం. ఎవరు ఏమైనా అనుకోనీ, నా బిహేవియర్ నాదే, నా అబద్ధాలు నావే, నా అహంకారం నాదే, నా అజ్ఞానం నాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఇలాంటి మనిషినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా భరించింది అని మనమీద మనకే జాలి కలుగుతోంది.