ఈసారి ఎవరు మర్డర్ కానున్నారో!?
posted on Apr 14, 2024 12:34PM
గత ఎన్నికల సందర్భంగా కోడికత్తి హత్యాయత్నం, బాబాయ్ వివేకా గుండెపోటు గొడ్డలి మర్డర్ విజయవంతంగా జరిపించుకోవడం ద్వారా జనంలో సానుభూతి సంపాదించి జగన్ ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కారు. జగనన్న అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే జనానికి అసలు విషయం అర్థమైపోయింది. కోడికత్తి ఎటాక్ సొంత ప్లానింగేనేని, బాబాయ్ మర్డర్ అబ్బాయ్ ఆధ్వర్యంలోనే జరిగిందని అందరూ తెలుసుకున్నారు.
ప్రజలకు తమ గురించి పూర్తిగా తెలిసిపోయిందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా జగన్ తయారయ్యాడు. అప్పట్లోలా ఇప్పుడు కూడా హత్యాయత్నం నాటకాలు ఆడితే జనం నమ్మరని తెలిసి కూడా మళ్ళీ ఇంకోసారి గులకరాయి హత్యాయత్నం నాటకం ఆడిన జగన్ నిజంగానే గుండెలు తీసిన బంటే. నవ్వుకుందురు గాక.. నాకేటి సిగ్గు అన్నట్టు ఈసారి ఎన్నికలప్పుడు కూడా మరోసారి మర్డర్ ఎటెంప్ట్ నాటకానికి జగన్ తెర తీశారు. ఇక సొంత మీడియా, పేటీయం పిశాచాలు తమ నాయకుడి మీద హత్యాయత్నం జరిగిందంటూ, దానికి కారణం చంద్రబాబేనంటూ భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఈ నాటకాలు చూసి జనం ఛీ కొడతారన్న మినిమమ్ సిగ్గు లేకుండా జగన్ అండ్ కో వ్యవహరిస్తోంది.
గులకరాయి మర్డర్ అటెంప్ట్ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు ఇంకో సందేహం ఏర్పడుతోంది. అప్పట్లో కోడికత్తి ఇన్సిడెంట్ తర్వాత బాబాయ్ గుండెపోటు గొడ్డలి మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు గులకరాయి మర్డర్ అటెంప్ట్ ఇన్సిడెంట్ తర్వాత జగన్ బంధువర్గం లేదా జగన్ మిత్రవర్గంలో ఎవరైనా మర్డర్ అయ్యే ప్రమాదం వుందేమోనని రాజకీయ పరిశీలకులకు అనుమానిస్తున్నారు. నిస్సిగ్గుగా గులకరాయి మర్డర్ అటెప్ట్.ని ప్లాన్ చేసిన జగన్ ఇంకోసారి బాబాయి మర్డర్ తరహాలో మరో మర్డర్‌కి ప్లాన్ చేసి, దాన్ని చంద్రబాబు మీద నెట్టడన్న నమ్మకమేమీ లేదని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు.