బాబాయి ఒక్కసారికే.. అబ్బాయ్ మాత్రం రెండుసార్లయినా..
posted on Apr 14, 2024 12:23PM
మొత్తానికి జగన్ ప్రాణం గట్టిదే. ఆ మాటకొస్తే వైఎస్ కుటుంబంలోని చాలామంది ప్రాణాల కంటే గట్టిదే. ఎందుకంటే జగన్ తాత రాజారెడ్డి, వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒకే ఒక్క గాలివానకి చచ్చినట్టు ఒకే ఒక మర్డర్ ఎటెంప్ట్ లో చనిపోయాడు. మహామేత సారీ.. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎవరూ ఊహించని విధంగా పావురాల గుట్టలో పావురమైపోయాడు.
ఇక బాబాయ్ వివేకా అయితే ఒకే ఒక మర్డర్ ఎటెప్ట్.లో గొడ్డలి వేటుకి గురైపోయాడు. జగనన్న మాత్రం ఒకసారి కోడికత్తి ‘మర్డర్ ఎటెప్ట్’ నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు గులకరాయి ‘మర్డర్ ఎటెంప్ట్ నుంచి బయటపడ్డాడు. జగనన్నని మర్డర్ చేయాలని అనుకున్నవాళ్ళ చాలా అమాయకుల్లా వున్నారు.
ఒకడేమో చిన్న కోడికత్తితో ఓ గొంతు మీదో కాకుండా చేతిమీద దాడి చేస్తాడు. ఇంకోడేమో చిన్న గులకరాయి విసురుతాడు. జగన్‌ని మర్డర్ చేయాలి అనుకున్న వాళ్ళని అమాయకత్వం ఆవహించి, ఏ గొడ్డలో, మరోటో తీసుకోకుండా రాళ్ళు రప్పల్లాంటి వాటితో ట్రై చేసి ఫెయిలవుతున్నారు.