ఆర్.ఎస్.బ్రదర్స్‌పై ఐటి దాడులు
posted on Oct 14, 2022 10:28AM
వస్త్ర ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిపొందినవాటిలో ఆర్.ఎస్. బ్రదర్స్ ఒకటి. రాష్ట్రంలో, ముఖ్యంగా రాజ ధాని హైదరాబాద్‌లో మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతీ శుభకార్యానికి ఆర్.ఎస్.బ్రదర్స్ ఉందిగదా ఇక దిగులే మిటి అన్నట్టుగా చీరలకు, నగలకు కూడా ఆ దుకాణానికే వెళ్లడం పరిపాటి. పిల్లల డ్రస్‌లు, పెద్దవాళ్ల దుస్తులు, చీరలు అనగానే ఆర్.ఎస్కే వెళ్లడం బాగా అలవాటుగా మారింది. ఇపుడు హైదరా బాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఆర్.ఎస్.బ్రదర్స్ వస్త్ర దుకాణాలపై ఐటి దాడులు జరుగుతున్నాయి.
ఇలాంటి మాల్స్ ఆర్ధికం అనతికాలంలోనే అభివృద్ధి చెందడం, లావాదేవీలు, వ్యాపార అంశాల మీద ఐటీ అధికారులు ప్రశ్నించనున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఉన్న ఆర్.ఎస్.బ్రదర్స్ మాల్స్‌పై ఒక్కసారిగా ఐటి దాడులు జరుగుతున్నాయి. ఇటీ వలి ఈ ఐటి దాడులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, హైదరాబాద్‌లోనూ తరచూ జరుగుతూండడం గమనిస్తున్నాం. అయితే ప్రత్యేకించి వస్త్రదుకాణాలు, మాల్స్ మీద దాడులు జరగడం ఇదే మొదటిసారి. అందులోనూ అందరినీ ఎంతగానో చాలాకాలం నుంచి ఆకట్టుకుంటున్న పెద్ద వస్త్ర మాల్ ఆర్.ఎస్.పై దాడి ఆశ్చర్యపరుస్తోంది.