తోక ముడిచిన ‘రేసు’ కుక్క!
posted on May 22, 2024 1:08PM
మొన్నటి వరకు జగన్ పాద సేవలో తరించిన ఐప్యాక్ ఖేల్ ఖతమ్ అయిపోయి.. ఏపీలో దుకాణ్ బంద్ చేసేసింది. ఆ సంస్థలో పనిచేసిన 150 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పేసింది. జగన్ మళ్ళీ వస్తాడు... మనం ఇంకా అబద్ధాలు ప్రచారం చేయొచ్చని కలలు కన్న ఐప్యాక్ ఉద్యోగులు షాకైపోయారు. ఐదేళ్ళపాటు హాయిగా బతికిన ఆ జీవితాలు రోడ్డున పడ్డాయి. సర్లేండి.. వాళ్ళకి ఉద్యోగాలు దొరక్కపోవు.. జీవితాలు మళ్ళీ మామూలు అవ్వకపోవు.. కాకపోతే ఏపీలో వైసీపీ పుట్టి మునిగిపోవడంతో ఐప్యాక్ ఉద్యోగుల జీవితాల్లో కూడా చిన్న కుదుపు వచ్చింది.
ఇప్పుడు మరో సంస్థ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఇంతకాలం జగన్‌కి కావల్సిన ప్రమోషన్ కార్యక్రమాలు, టీడీపీ వ్యతిరేకంగా విష ప్రచారాలు, ఉత్తుత్తి సర్వేలు జరిపి జగన్ గెలుస్తున్నాడని ప్రచారం చేస్తూ, తోకఊపుతూ బతికిన ‘రేసు’ కుక్క లాంటి సంస్థ కూడా తోక ముడుచుకుని తన దుకాణం బంద్ చేసే ప్రయత్నాల్లో వుంది. ఈ సంస్థ కూడా తాజాగా తన తన దగ్గర పనిచేస్తున్న దాదాపు రెండు వందల మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పేసింది. ఇక మీకూ మీకు ఎలాంటి సంబంధం లేదు.. మీకు రావల్సిన బ్యాలన్స్ సాధ్యమైనంత త్వరలో పంపించేస్తాం అని క్లియర్ కట్‌గా చెప్పేసింది. దాంతో ఆ ఉద్యోగులు బతుకుజీవుడా అని తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. పుబ్బలో పుట్టి మఖలో అంతరించిపోయే ఇలాంటి దిక్కుమాలిన సంస్థల్లో చేరితే పరిస్థితి ఇలాగే వుంటుంది. అందుకే యూత్ ఇలాంటి సంస్థలకి దూరంగా వుండాలి..