UPI సేవలు గోవిందా.. గోవిందా!

దేశ వ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దాదాపు గంట సేపు ఈ సేవలన్నీ నిలిచిపోయాయి. దీంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్ పని చేయలేదు. ఈ పరిస్థితి దాదాపు గంటకు పైగా ఉంది.   దీంతో అనేక మంది యూజర్లు సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ గంట సేపూ వినియోగదారులు చెల్లింపుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగదు లావాదేవీల కంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైనే అత్యధికులు ఆధారపడుతున్న తరుణంలో యూపీఐ సేవలకు ఇలా అంతరాయం ఏర్పడటం దారుణమని వినియోగదారులు అంటున్నారు. ఇటువంటి పరిస్థితి ఇటీవలి కాలంలో  తరచూ ఎదురౌతోందని ఆరోపిస్తున్నారు.