గుడివాడ అమర్నాథ్.. మంత్రే కానీ ప్రొటోకాల్ ఊస్ట్!

నవ్విన నాపచేనే పండుతుందన్న సామెత ఇప్పుడు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు సరిగ్గా అతికి నట్లు సరిపోతుంది. సాగినంత కాలం  పరిధులు లేకుండా ఎగిరెగిరి పడిన గుడివాడకు ఇప్పుడు ఏదీ సాగడం లేదు. జగన్ కేబినెట్ లో ఐటీ మంత్రిగా ఉన్న గుడివాడ.. గుడ్డు కథ చెప్పి బాగా పాపులర్ అయ్యారు.  ఇక నిన్నమొన్నటి వరకూ ఆయన తీరు ఎలా ఉండేదంటే తనకు తానే వైసీసీలో జగనంతటివాడినని బిల్డప్ లు ఇచ్చేసుకునే వారు.  అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు కనీసం మంత్రిగా దక్కాల్సిన గౌరవం కూడా దక్కడం లేదు. వచ్చే ఎన్నికలలో పోటీకి గుడివాడ అమర్నాథ్ కు నో టికెట్ అని జగన్ ఇప్పటికే చెప్పకుండానే చెప్పేశారు. ఆయన సీటును మార్చేసిన జగన్.. మరో చోట పోటీకి కూడా అవకాశం ఇవ్వలేదు. దీంతో తత్వం బోధపడిన మంత్రి గుడివాడ అమర్నాథ్ అంతా జగన్మాయ, జగన్ దయ అంటూ వేదాంతంలోకి దిగిపోయారు. ఇప్పుడు తాజాగా గుడివాడ అమర్నాథ్ కు మరో ఘోర పరాభవం జరిగింది. అలా పరాభవించింది కూడా పార్టీ అధినేత, సీఎం జగనే. మంత్రిగా అమర్నాథ్ కు ఉన్న ప్రొటో కాల్ ను తొలగిస్తూ ప్రభుత్వం జీవో  జారీ చేసింది. ఇప్పటి వరకూ ఏ మంత్రికీ ఇటువంటి పరాభవం ఎదురై ఉండదు. పాపం గుడివాడ అమర్నాథ్ అని పార్టీ వర్గాలే అంటున్నాయి.

ఇంతకీ జరిగిందేమిటంటే.. మంత్రి హోదాలో ఉన్న అమర్నాథ్ విశాఖ జిల్లాలు ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి స్వాగతం పలికి రిసీవ్ చేసుకుంటారు. ఇది ప్రొటోకాల్. ఇప్పటి వరకూ అదే జరిగింది. ఎప్పుడైతే జగన్ ఆయనకు టికెట్ లేదని క్లారిటీ ఇచ్చారో అప్పుడే నీరసపడిపోయిన అమర్నాథ్ కుఇప్పడు ఆయనకు ఉన్న ప్రొటోకాల్ ను తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వులతో ఇక ఇప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. విశాఖకు ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్  రానున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు రెడీ అయిపోతున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ కు దిమ్మతిరిగేలా ఆయనకున్న ప్రోటోకాల్ గౌరవాన్ని తొలగిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికే బాధ్యతను బూడి అప్పలనాయుడికి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గుడివాడ అమర్నాథ్ కు చెప్పకుండానే  ఆయనకు స్వాగతం చెప్పే బాధ్యతను బూడి ముత్యాలనాయుడుకు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకూ స్వాగతం చెప్పే గుడివాడ అమర్నాథ్ కు ఇంతకు మించిన పరాభవం ఎముంటుందని పరిశీలకులు అంటున్నారు. గుడివాడకు చెప్పకుండానే ఆయన నియోజకవర్గం అనకాపల్లికి వేరే అభ్యర్థిని ప్రకటించిన జగన్ ఇప్పటికీ ఆయనకు మరో చోట నుంచి పోటీకి అవకాశం ఇస్తానన్న హామీ ఇవ్వలేదు. అసలు పట్టించుకోలేదు.

దీంతో ఆయనకు పోటీ చేసే చాన్స్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నారన్న ప్రచారం పార్టీలోనే జోరుగా సాగుతోంది.   జగన్ అండ చూసుకుని గుడివాడ అమర్నాథ్  ఇప్పటి వరకూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ పై ఇష్టారీతిన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు  వ్రతమూ చెడి ఫలమూ దక్కని చందంగా జగన్ నుంచి తిరస్కారం ఎదురుకావడంతో ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడ్డారు. అనకాపల్లి సీటు లేదని జగన్ తేల్చేసిన నాడే బహిరంగంగా గుడివాడ కళ్ల నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. తల రాత జగనే రాస్తారని ఆయన పాపం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే.. ఇప్పుడు రాత రాయడం కాదు.. ఏకంగా పరువే తీసేపి పక్కన కూర్చో పెట్టారని నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu